Header Banner

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్! మోదీ సర్కారు కీలక ఆమోదం.. ఆ పనులకు ఇక బ్రేకులు లేవు!

  Wed Mar 12, 2025 11:15        Politics

ఏపీ కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ విషయంలో మోదీ ప్రభుత్వం వరుస సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి - పోలవరం కు తమ వంతు సహకారం అంది స్తోంది. రైల్వే ప్రాజెక్టులు ... జాతీయ రహదారుల్లోనూ ప్రాధాన్యత పెంచింది. ఇక, ఇప్పుడు మరో సారి ఏపీ అడిగిన విధంగా మరో నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ గా మారుతోంది.


ఇది కూడా చదవండినిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన! 30 వేల మంది పైలట్లు అవసరం..


ఏపీ కోరిన విధంగా
కేంద్రం పోలవరం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖ ఆమోదం తెలిపాయి. దీంతో, ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే పోలవరం కోసం కేంద్రం రూ. 5,512 కోట్ల రూపాయలను కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోలవరం కోసం ఒకే ఆర్దిక సంవత్సరంలో కేంద్రం ఇంత మొత్తంలో నిధులు విడుదల చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధులు త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు.


ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


పోలవరం కు నిధులు
కేంద్రం గతంలో మొదట రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనక కేంద్రం రీయింబర్స్ చేసేది. కాగా, ఇప్పుడు మాత్రం కేంద్రం ఒక ఆర్దిక సంవత్సరంలోనే 5 వేల కోట్లకుపైగా అడ్వాన్‌ ఇచ్చింది. కేంద్రం మూడో సారి మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ 12 ,157 కోట్లు పోలవరం ప్రాజెక్టు అడ్వాన్స్‌ ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తర్వాత రూ.2,807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కొంత అయితే రూ.2,348 కోట్లు అడ్వాన్స్ నిధులే. అందులో 75% నిధులు ఖర్చుచేసి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత అడ్వాన్స్‌ నిధులు ఇస్తామని ప్రకటించింది. రెండోవిడత రూ.2,705 కోట్ల అడ్వాన్‌తో కేంద్రజలశక్తి శాఖ కు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఆర్థిక శాఖలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


కేంద్రం ప్రాధాన్యత
కాగా, ఈ సమయంలో రూ.1,300 కోట్లే ఇచ్చేలా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. తిరిగి ఫైలు కేంద్ర జలశక్తికి చేరింది. ఈ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మళ్లీ ఆ ఫైలులో మార్పు వచ్చాయి. రూ.2,705 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలోనే నిధులు రాష్ట్రానికి రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.5,936 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. ప్రస్తుత నిధులతో రానున్న ఆరు నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం - అమరావతి విషయంలో కేంద్రం ఏపీకి అందిస్తున్న సాయం తో .. ఏపీ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు సిద్దం అవుతోంది. అమరావతి పనుల రీ లాంఛ్ కు ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #unioin #goodnews #project #works #budget #greensignal #todaynews #flashnews #latestnews